¡Sorpréndeme!

RCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

2025-04-03 1 Dailymotion

 జనరల్ గా ఏదైనా టీమ్ అయితే విన్న్ అయితే ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓడిపోతే ఏం పర్లేదు మళ్లీ కప్పు కొట్టేయొచ్చులే అని సరిపెట్టుకుంటారు. కానీ లోయల్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకుని తిరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును మాత్రం ఈసారి మిగిలిన టీమ్ ఫ్యాన్స్ ఓ ఆటాసేడుకుంటున్నారు. దీనికి రీజన్ ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిన అతి. వరుసగా రెండు మ్యాచుల్లో ముంబై, చెన్నై లాంటి జట్లను ఓడించే సరికి వాళ్లపై విపరీతమైన ట్రోల్స్, అతి చేశారట బెంగుళూరు ఫ్యాన్స్. ఇప్పుడు అదే ఓన్ మెడిసన్ టేస్ట్ ఆర్సీబీ చూడాల్సి వచ్చింది. నిన్న గుజరాత్ తో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను ఓడిపోయింది పటీ దార్ సేన. ఇకంతే సోషల్ మీడియా షేకైపోయింది. ఆ టీమ్ ఫ్యాను ఈ టీమ్ ఫ్యాను అని లేకుండా అందరూ ఆర్సీబీని గట్టిగా ఏసుకున్నారు. చిన్న స్వామి స్టేడియంలో ముంబైని ఓడించినప్పుడు..చెపాక్ లో చెన్నైని 6వేల రోజుల తర్వాత అంటే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఓడించినప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిన అతిని మిగిలిన జట్ల ఫ్యాన్స్ మర్చిపోలేదు. అందుకే ఇప్పుడు అయ్యిందా బాగా అయ్యిందా అంటూ ట్రోల్స్ తో సోషల్ మీడియా పేజెస్ ను నింపేశారు మిగిలిన టీమ్స్ అభిమానులు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడు భూమి మీదకు దిగి వచ్చారని..ఇన్నాళ్లూ ఆకాశంలోనే తిరుగుతున్నారని..మొదట స్టైలిష్ గా మొదలయ్యే ఆర్సీబీ ఫ్యాన్స్ అతి టోర్నీ చివరకు వచ్చే సరికి జోకర్ లా మారిపోతుందంటూ రకరకాల మీమ్స్ రకరకాల పోస్టర్లతో ఆర్సీబియన్స్ నైతే ఓ ఆటాడేసుకుంటున్నారు. ఓవరాక్షన్ చేసినందుకు ట్రోల్స్ తో తోలు తీసేస్తున్నారు.